జమ్మికుంట, ఏప్రిల్ 30 (zindagi9news): పదో తరగతి 2025 ఫలితాల్లో జమ్మికుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు అద్భుత విజయాన్ని నమోదు చేశాయి. మండలంలో మొత్తం 361 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 345 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 95.84% గా నమోదైంది.
ZPHS కోరపల్లికి చెందిన విద్యార్థిని గిరవెనా స్పందన 600 మార్కుల్లో 557 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ZPHS బాయ్స్ జమ్మికుంటకి చెందిన J. ఆశ్లేష విద్యార్థి 546 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు.
ఈ విజయానికి చిహ్నంగా మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించడం విశేషం. విజయం సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, సదానందం, వేణుగోపాల్, అంజుమ్, పద్మ, సుప్రియ అభినందించారు.
మండల విద్యాధికారి మంథెన హేమలత మాట్లాడుతూ, “రానున్న రోజుల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు మరింత కృషి చేస్తాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MRC సిబ్బంది, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
