వనపర్తి: ఖిల్లా ఘనపూర్ మండలానికి చెందిన ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) కొండన్న ఏసీబీ వలలో చిక్కాడు. గ్రామంలో జరుగుతున్న ఆగ్రో ఇండస్ట్రియల్ 160 కె.వి విద్యుత్ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ సలీం, తగిన బిల్లుల ఆమోదం కోసం ఏఈను సంప్రదించాడు. అయితే బిల్లులకు అప్రూవల్ ఇచ్చేందుకు కొండన్న రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు.అందుకు సంబంధించిన సమాచారం ఆధారంగా సలీం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు పథకం ప్రకారం AE కొండన్న చేతిలో లంచం తీసుకుంటుండగా అతడిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
