హైదరాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, సీఎం ఏ. రేవంత్ రెవంత్ రెడ్డి ‘ఇందిరా మహిళా శక్తి’ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులు అప్పగించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ ఎండీ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ విశేషాలు:
✅ 150 బస్సులు స్వయం సహాయక సంఘాలకు
✅ ఆర్టీసీతో ఒప్పందం – అద్దె రూపంలో ఆదాయం
✅ మహిళా సాధికారతకు కొత్త మార్గం
ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
