శంకరపట్నం, ఫిబ్రవరి 14 (జిందగీ9న్యూస్) : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అరుదైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం పరిధిలో ఉండడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మత్స్యగిరీంద్ర స్వామి వారి కరుణాకటాక్షాలతో కొత్తగట్టు గ్రామ ప్రజలే కాకుండా నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు ఆయన చెప్పారు. కొండపైన కొలువైన ఈ ఆలయం పరిసరాలు అహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగట్టు మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, శంకరపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గట్టు తిరుపతి , జిల్లా కార్యదర్శి బండారు తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ, కొత్తగట్టు గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు తిరుపతి, ఆలయ పూజారి మురళీధర చారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
