హుజూరాబాద్, ఫిబ్రవరి 13: అంతర్జాతీయ కరాటే పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం లో ఇటీవల నిర్వహించిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో GSKDI విద్యార్థులు ప్రతిభ చూపించి ఆరు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించారు.
బహుమతులు గెలుచుకున్నవారు:
SK షాదుల్లా బాబా (12 సం.) – బ్లాక్ బెల్ట్ కేటగిరీలో గోల్డ్ మెడల్
జున్ను కావ్య (15 సం.) – ఆరెంజ్ బెల్ట్ కేటగిరీలో గోల్డ్ మెడల్
ఓ. సన్నిహిత (14 సం.) – కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్
హుమేరా తస్లీమ్ (8 సం.) – కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్
CH ఆదిత్య వర్ధన్ (13 సం.) – వైట్ బెల్ట్ కేటగిరీలో గోల్డ్ మెడల్
CH సాయి చరణ్ (11 సం.) – ఎల్లో బెల్ట్ కేటగిరీలో సిల్వర్ మెడల్
ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, “కరాటే విద్య ఆత్మరక్షణకు తోడుగా, శారీరక & మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. విద్యార్థులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాలిద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త మొహమ్మద్ సలీం, కాంగ్రెస్ నాయకులు మేకల తిరుపతి, గోస్కుల మధు, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, డైరెక్టర్ గోపాల్, గ్లోబల్ షో టో ఖాన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ తులసి లక్షణామూర్తి తదితరులు పాల్గొన్నారు.
“ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఒలింపిక్స్లో మెడల్స్ గెలుచుకోవాలని ఆశిస్తున్నాం” అని నిర్వాహకులు తెలిపారు.
