బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడం తీవ్ర అన్యాయం..
ఎన్నికలుంటేనే ప్రజలు గుర్తుకొస్తారా..?
ఎన్నికలు ఉన్నాయనే బీహార్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం..
ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సాధించిన ఘనకార్యం ఇదా..?
పూర్తిగా వైఫల్యం చెందారు
తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా ?
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్ననే దక్కిందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను తన రాజకీయ అవసరాలకే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు.
శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ఉన్న బీహార్ రాష్ట్రానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్య మిచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అంశాలకు కూడా బడ్జెట్లో మొండి చేయి చూపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం
కేంద్ర ప్రభుత్వా ధమన నీతి బయటపడుతుందన్నారు.
దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరం అన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? ఈ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని నిలదీశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. వారంతా పూర్తిగా వైఫల్యం చెందారని, తెలంగాణకు ఒక్కటంటే ఒక్క పెద్ద ప్రాజెక్టును కూడా సాధించలేకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని ఆరోపించారు.
రాష్ట్రానికి ఇండియన్ ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్ ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదన్నారు. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టు సాధించలేకపోయారని విమర్శించారు.. ప్రసాద్ స్కీమ్ లో వేములవాడ పుణ్యక్షేత్రానికి చోటు దక్కకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలప కూడా ఏ ఒక్క దానికి చోటు దక్కకపోవడం దారుణమన్నారు. ఇది కేంద్ర మంత్రి సమర్థత అని ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరిగే బిహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని, ఎన్నిక లుంటేనే రాష్ట్రాలను పట్టించుకుంటామన్న వైఖరి సరికాదన్నారు. పదేళ్లుగా మోడీ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారని రాజేందర్ రావు విమర్శించారు. ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తున్నారని పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
