ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలి,
నిరుపేదలకు అండగా నిలవాలి.
నంది అవార్డు గ్రహీత ప్రభు..
దుప్పట్లు, చీరలు పంపిణీ చేసిన సునీల్ కు ఘనంగా సన్మానం.
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిరుపేద వృద్ధులు, వితంతువులకు చలి వణికిస్తున్న సమయంలో కన్న వారే పట్టించుకోని ఈ రోజుల్లో జమ్మికుంట సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కరస్పాండెంట్ సునీల్ సోమవారం 10 కుటుంబాలకు 10 వేలు విలువ చేసే దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ సునీల్ మానవత్వంతో గత 25 సంవత్సరాల నుండి జమ్మికుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతోపాటు విద్య వ్యాపారంగా కాకుండా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారని, తమ విద్యాసంస్థలు చదివినటువంటి నిరుపేద విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు అయ్యారని తెలిపారు.
నాటి నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసి వందలాది కుటుంబాలకు చేయూతను అందించడంలో ముందు వరుసలో ఉన్నాడని అభివర్ణించాడు.
ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు.
మారుతి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాగితాలు ఇనుప సామాన్లు ఏరుకుని జీవించే నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి పక్కా ఇండ్లు, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం సునీల్ శాలువాతో సత్కరించి అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు.
