జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అర్బన్ జమ్మికుంట లో డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ మొలుగు చందన ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో సోమవారం రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని వైద్య సిబ్బంది చే నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మొలుగు చందన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలనీ అన్నారు. హెచ్ఐవి వైరస్ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది అన్నారు. అసురక్షిత శృంగారం వలన, కలుషితమైన రక్తం ఎక్కించడం వల్ల, కలుషిత సిరంజిలు, సూదులు వాడటం వల్ల ఈ వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది అన్నారు. మన భారత దేశంలో 5 వ స్థానంలో మన తెలంగాణ రాష్టం ఉంది అన్నారు. అన్ని పాఠశాలలో, జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఎయిడ్స్ వ్యాధి గ్రాస్తులపై వివక్ష చూపరాధన్నారు. ఈ కార్యక్రమములో డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ మొలుగు చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ అరుణ, సదానందం, రత్న కుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, అర్బన్ ఏఎన్ఎం లు మరియు అర్బన్ ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
