బుల్లితెర నటి శోభిత గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలని సిబ్లాక్ లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని సూసైడ్ చేసుకుంది. కన్నడ సినీరంగానికి చెందిన శోభిత కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.శోభిత ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలరించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. గతేడాదే వివాహం చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఆమె మృతి పట్ల సినీ, సీరియల్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
