జమ్మికుంట, మే 6 (Zindagi9News): జమ్మికుంటలో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. పొన్నగంటి కావ్య భర్త వెంకటేశ్వర్లు (39), సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2023లో మ్యానకొండ సాయికిరణ్ అనే వ్యక్తి తనను కలసి, తక్కువ ధరకు భూములు మరియు ఫ్లాట్లు ఇస్తానని చెప్పి, 2023 జూన్ 25 నుండి ఇప్పటివరకు రూ.93 లక్షల నగదు తీసుకున్నాడు.,ఎన్నిసార్లు అడిగినప్పటికీ భూమి గానీ, ఫ్లాట్ గానీ చూపించకపోవడంతో పాటు, డబ్బుల గురించి ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడ్డాడని విన్నవించారు. ఫిర్యాదు మేరకు సాయికిరణ్‌పై మోసపూరితంగా కేసు నమోదు చేసినట్టు జమ్మికుంట సీఐ వరగంటి రవి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
