TS TET : రేపు టెట్ ఫలితాల విడుదల..!!
హైదరాబాద్, జూలై 21:
టెట్ అభ్యర్థులకు కీలక సమాచారం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు (జూలై 22) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు అధికారిక వెబ్సైట్లైన:
🔗 https://tgtet.aptonline.in/tgtet/
🔗 https://schooledu.telangana.gov.in/
లో అందుబాటులో ఉంటాయి.
ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2025 TS TET పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించబడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రాథమిక కీ తర్వాత, రేపు తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
ఫలితాల విడుదలకు ముందు అవసరమైన వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని విద్యాశాఖ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
