
46 లక్షల మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కో మహిళకు సుమారు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు స్క్రీనింగ్ చేపట్టి, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేయనున్నారు.
