
24వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి రాగ రవళి
జమ్మికుంట: 24వ వార్డు అభివృద్ధే ధ్యేయంగా ప్రజాసేవా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మద్దూరి రాగ రవళి తెలిపారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జమ్మికుంట రాజకీయాల్లో సుపరిచితుడైన మద్దూరి రాజనర్సు కుమార్తెగా ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యల కారణంగా ఇటీవల తన తండ్రి మృతిచెందడం తనను కలచివేసిందని, ఆయన కోరిక మేరకు ప్రజాసేవలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. AIFB పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తన ఎన్నికల గుర్తు సింహం అని తెలిపారు.
ప్రధాన అభివృద్ధి హామీలు
• వార్డులో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి
• ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
• 24వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు
• డ్రైనేజ్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
• అర్హులైన వారికి వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు ఇప్పించడం
• రేషన్ కార్డు అర్హులైన లబ్ధిదారులకు అందించడం
• ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి
• పొచ్చమ్మ తల్లి గుడి నిర్మాణానికి సహకారం
• యువతకు వృత్తి శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు
• అవసరమైన చోట్ల స్ట్రీట్ లైట్ల ఏర్పాటు
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 24వ వార్డు అభివృద్ధిలో వెనుకబడిందని, తనకు ఒక్క అవకాశం ఇస్తే స్పష్టమైన కార్యాచరణతో వార్డును అభివృద్ధి చేస్తానని రాగ రవళి హామీ ఇచ్చారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
