
స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు తీసుకెళ్లండి
– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపరచినట్లు వెల్లడించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్ల వారీగా గుర్తించి, సంబంధిత వాహన యజమానులకు నోటీసులు కూడా పంపినట్లు తెలిపారు.తగిన ఆధార పత్రాలతో హాజరయ్యే యజమానులకు వాహనాలను తిరిగి అందజేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. వాహన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.
మరింత సమాచారం కోసం సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజ్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే,
ఎమ్టీఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ – 8712685158
సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య – 8008389789
నంబర్లను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
