ఢిల్లీ: సిరిసిల్ల లేదా హుస్నాబాద్‌లో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
సైనిక్ స్కూల్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అలాగే, దేశభక్తి భావన, జాతీయ సమైక్యత విలువలను ఈ పాఠశాలలు యువతలో నాటివేస్తాయని అన్నారు.
ఈ ప్రతిపాదనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
