సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ కోసం ప్రత్యేకమైన శాలువా నేసారు. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆదేశాల మేరకు హరిప్రసాద్ దాదాపు ఐదు రోజుల పాటు కృషి చేసి ఈ విశిష్ట శాలువాను రూపొందించారు.
ఈ శాలువా ప్రత్యేకత ఏంటంటే… రెండు 32 గ్రాముల వెండి పట్టు దారాలతో తయారు చేశారు. దాదాపు రెండున్నర మీటర్ల పొడవుతో, 46 ఇంచుల వెడల్పుతో నేసిన ఈ శాలువా రెండు వైపులా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రూపొందించారు. ఒక వైపు కేసీఆర్ ముఖచిత్రం, మరోవైపు వరంగల్ కాకతీయ కామన్ మరియు సిల్వర్ జూబ్లీ లోగోలు ఉంచారు.
ఈ ప్రత్యేకమైన శాలువాను ఈరోజు వరంగల్ సభలో జిందం చక్రపాణి కేసీఆర్కు అందించనున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
