
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన సామాగ్రిని అందజేశారు. గ్రామానికి చెందిన నేరెళ్ల ఓం నారాయణ గౌడ్ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు రవీందర్, నాగరాజు, రాజు, భుజేంద్ర చారి, సుధాకర్, శ్రీధర్ తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
