హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రూ. 6 వేల కోట్లతో “రాజీవ్ యువ వికాస్” పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ. 3 లక్షల వరకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించనున్నారు. మార్చి 15 నుండి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను బుధవారం నిర్వహించే మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
Zindagi9News ఈ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.
