
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, అలాగే మిడ్ మానేర్ రిజర్వాయర్ నుండి వస్తున్న వరద కారణంగా లోయర్ మానేరు డ్యామ్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు (ఆగస్టు 29, 2025) ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్యలో స్పిల్వే గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
డ్యామ్ దిగువన మానేరు నది పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
మానేరు నదికి వరదలు కొనసాగినంతకాలం, అంటే అక్టోబర్ చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
