
మృతుడి దహన సంస్కారానికి ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి ఆర్థిక చేయూత
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్, అంబేద్కర్ నగర్‌కు చెందిన యువకుడు గంధం స్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని స్థానిక జిల్లా కాంగ్రెస్ ఎస్.సి. సెల్ మాజీ అధ్యక్షులు గంధం రాజశేఖర్ వనపర్తి ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి దహన సంస్కారాల నిమిత్తం మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.సి. సెల్ మాజీ అధ్యక్షులు గంధం రాజశేఖర్, టౌన్ ఉపాధ్యక్షులు గంధం సునీల్ కుమార్, వినయ్ కుమార్, 1వ వార్డ్ ఇంచార్జ్ అడ్డాకుల రాజు, గంధం గాంధీ, సిద్దీ అశోక్, పట్టణ యువనాయకులు గంధం ఉత్తమ్ కుమార్, గాడిముడి చిట్టెమ్మ, జానమ్మ, దేవరపల్లి ఉత్తరమ్మ, ఎద్దుల చంద్రకలతో పాటు కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
