
వీణవంక, మే 29 (జిందగీ 9 న్యూస్): ఇసుక క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రహదారులు ప్రమాదకరంగా మారాయి. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి నుంచి కొండపాకకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ ఇసుక లారీలతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జాములో ఇరుక్కుంటున్నారు. వాహనాల మోతతో గ్రామాలు ఉలిక్కిపోతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు ధ్వంసమవుతున్నాయి. గ్రామస్తులు “మా ఊరికి దారి ఎక్కడ?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరు నది పక్కన ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఇసుక క్వారీ దౌర్జన్యానికి బలైపోతున్నారు. అధికారుల వెంటనే స్పందన కోరుతున్నారు.
