మహిళల సాధికారత కోసం కీలక నిర్ణయాలు – సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి’ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చే వరకు విశ్రమించబోము” అని స్పష్టం చేశారు.

మహిళలకు ఆర్థికంగా అండగా ప్రభుత్వం
✔️ రైస్ మిల్లుల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వ సహాయం.
✔️ ప్రభుత్వ స్థలంలో గోడౌన్లు నిర్మించేందుకు రుణ సదుపాయాలు.
✔️ రైస్ మిల్లింగ్ ద్వారా ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరా చేసే అవకాశం.
✔️ స్వయం సహాయక సంఘాల సభ్యత్వం 65 లక్షల నుంచి 1 కోట్లకు పెంచేందుకు మార్గం సుగమం.
✔️ సభ్యత్వ వయో పరిమితిని 18 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు తగ్గింపు, గరిష్ట పరిమితి 60 నుంచి 65 ఏళ్లకు పెంపు.
1000 ఎలక్ట్రిక్ బస్సులకు మహిళలు యజమానులు
✔️ ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు ఇచ్చేందుకు మహిళలకు అవకాశం.
✔️ ఇప్పటికే 150 బస్సులు ప్రారంభం.
✔️ మహిళలు ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదించే విధానం.
చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్
✔️ రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు.
✔️ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మహిళలు ఎన్నికయ్యేలా ప్రోత్సాహం.
✔️ నాయకత్వ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచన.
మహిళా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్
✔️ స్వయం సహాయక సంఘాల తయారీ ఉత్పత్తులకు 150 షాపుల కేటాయింపు.
✔️ పన్ను రాయితీపై ప్రభుత్వం పరిశీలన.
విద్య, ఉపాధిలో మహిళలకు పెద్ద పీట
✔️ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ స్వయం సహాయక సంఘాలకు అప్పగింపు.
✔️ స్కూల్ యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగింపు.
✔️ ధర ₹75కు పెంచి, గిట్టుబాటు ధర అందించే చర్యలు.
సోలార్ ఎనర్జీలో మహిళలకు కీలక భూమిక
✔️ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి మహిళా సంఘాలకు బాధ్యత.
✔️ ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసం ప్రతి జిల్లాకు ₹25 లక్షల నిధులు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను ఆవిష్కరించారు. 2,82,552 సంఘాలకు రూ.22,794 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సోలార్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
(Zindagi9News – తాజా అప్డేట్)
