తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు వేలం వేసే ప్రక్రియకు పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ వ్యతిరేకం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన నిర్ణయాలతో ఎక్కువగా నిర్భందాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు” అని అన్నారు.
పిడిఎస్యూ జిల్లా కమిటీ ప్రకారం, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అపరాధకరమైన రీతిలో వ్యవహరించారని చెప్పారు. “వారిని అరెస్టు చేసి, 60 మందిని రాయ్ దుర్గ్, మాధాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన,” అని పిడిఎస్యూ జిల్లా కమిటీ ఆరోపించింది.
పి డి ఎస్ యూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. “భూముల వేలం నిలిపివేసి, విద్యార్థుల తరపున ముఖ్యమంత్రిని ముట్టడిస్తామన్నారు,” అని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్, రాజేష్, దేవేందర్ ఇతర నేతలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
