జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) లో అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం రెండు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గురువారం రోజున ఉదయం 11 గంటలకు అన్న ప్రసాద వితరణ వార్షికోత్సవం నిర్వహించబడును అని అన్నపూర్ణ సేవా సమితి
తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించగలరని కోరారు.

