మానవ హక్కులపై పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 4 (zindagi9news):
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాలో మానవ హక్కుల సహాయక సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎం.ఏ. సలీం విద్యార్థులను ఉద్దేశించి మానవ హక్కుల ప్రాధాన్యతను వివరించారు. హక్కుల పరిరక్షణ, సమాజంలో అవగాహన పెంపొందించుకోవడంపై ఆయన విలువైన సూచనలు అందించారు.
సదస్సులో శ్రీ గురు రాఘవేంద్ర ఇండస్ట్రీస్, శిల శ్రీనివాస్ గాయత్రి ఆటోమొబైల్స్, శ్రీ సాయి నిధి టెండర్స్, కాశీనాథులు సంస్థలవారి సహకారం లభించింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు షబానా, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ సలహాదారు కేతు రమణారెడ్డి, అడ్వకేట్ అనిత, శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున, పాఠశాల ప్రిన్సిపల్ సిద్ధరాం రెడ్డి, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, నర్సింగ్ ఆఫీసర్ బుక్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థుల్లో హక్కులపై చైతన్యం కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది.
