బోయినిపల్లి, ఫిబ్రవరి 19:కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి గెలుపు కోసం ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ పెరగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో యువతను మోసం చేసిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరూ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.అంజిరెడ్డి గెలుపు కోసం అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బిజెపి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కోల అశోక్, బిజెపి జిల్లా నాయకులు మోతే శ్రీహరిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రేండ్ల శ్రీనివాస్, బిజెపి మండల ఉపాధ్యక్షులు వడ్నాల రాజు, దళిత మూర్చ మండల అధ్యక్షులు తాళ్ల రాజశేఖర్,
బిజెపి నాయకులు ఆదిపల్లి పృథ్వి గౌడ్, బిజెపి నాయకులు బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సుంకరి అనిల్ కుమార్, బూత్ అధ్యక్షులు ముదాం అనిల్ కుమార్, నరుకుల మల్లేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
