జమ్మికుంట పట్టణం శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఫిబ్రవరి 3 సోమవారం రోజున ఉదయం 10:00 గంటలకు వసంత పంచమి ( సరస్వతీ మత జన్మదినం ) సందర్భంగా పాఠశాల లోని సరస్వతీ మాత మందిరం ముందు ” సామూహిక అక్షరాభ్యాస” కార్యక్రమం నిర్వహించబడును అని ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు . వసంత పంచమి అనగా విద్యాధీదేవతయైన శ్రీ సరస్వతీ మాత జన్మించిన రోజు ఈ విశిష్ట పర్వదినమున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులలో గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ధారణ శక్తి కలుగును కావున తల్లిదండ్రులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని తమ చిన్నారులకు మరియు మీకు తెలిసిన వారికీ సమాచారం అందించి అక్షరాభ్యాసం చేయించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడవలసిందిగా కోరారు.
విశేషము : బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చన చేయించిన కుంకుమ మరియు అమ్మవారి ఫోటో చిన్నారులకు అందజేయబడును.
గమనిక : తల్లిదండ్రులు రెండున్నర సంవత్సరాలు పైబడిన పిల్లలను సోమవారం రోజున ఉదయం 9 గంటలకు పాఠశాలకు తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోగలరు.అక్షరాభ్యాసం కోసం వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కొబ్బరికాయ,పూలు,పళ్ళు,బియ్యం మంగళహారతి..తీసుకొని రావలసిందిగా తెలియజేశారు. పలక- బలపం, పసుపు- కుంకుమ పాఠశాల నుండి ఇవ్వబడును అని పూర్తి వివరాలకు ఈ నెంబర్లకు 9442431247,7995444962,9010978861,8790650142 సంప్రదించవచ్చని తెలిపారు.
