
ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాల కార్యాలయాన్ని సందర్శించిన అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు
కొత్తపల్లిలో ప్రపంచ తపాలా దినోత్సవం వేడుకలు
🔹🔸🔹🔸🔹🔸🔹🔸
కరీంనగర్ : ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులు స్థానిక తపాల కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి ఆత్మీయ అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.
తపాల సేవలు ఎంతో పురాతనమైనవని, ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో తపాలా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో ఈ సేవలు విశిష్టమైనవని ఆయన అన్నారు.
విద్యార్థులు ఈ సందర్భంగా కొత్తపల్లి తపాల కార్యాలయాన్ని సందర్శించి సబ్ పోస్ట్ మాస్టర్ సంపత్ కుమార్, పర్యవేక్షకులు, పోస్టల్ సిబ్బందికి జ్ఞాపికలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
