గ్రామాలల్లో పండుగ వాతావరణంలో ప్రారంభమైన నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు..
– డప్పు చప్పుళ్లు, కోలాటాలు, టపాసులు పేల్చి, బంతి పూలు చల్లి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, మహిళలు, కాంగ్రెస్ నేతలు..

– టేకుమట్ల అంబేద్కర్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే..

– నాలుగు పథకాలకు సంబంధించి లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్..

– గ్రామ సభలల్లో వచ్చిన ప్రతీ ఒక్క దరఖాస్తును క్రోడీకరించి, అర్హుల గుర్తింపు..

– పథకాల అమలులో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదు..

– రాంపూర్, బుర్రకాయలగూడెం, లింగాల, ముచినిపర్తి, టేకుమట్ల, అంకుశాపూర్, గట్లకానిపర్తి, రామగుండాలపల్లి గ్రామాలల్లో నిర్వహించిన నాలుగు పథకాల ప్రారంభోత్సవ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
భూపాలపల్లి నియోజకవర్గం: భూపాలపల్లి/గణపురం/రేగొండ/చిట్యాల/టేకుమట్ల/మొగుళ్లపల్లి/శాయంపేట/కొత్తపల్లిగోరి మండలాల నుండి..
రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవాలు భూపాలపల్లి నియోజకవర్గంలోని రాంపూర్(భూపాలపల్లి మండలం), బుర్రకాయలగూడెం(గణపురం మండలం), లింగాల(రేగొండ మండలం), ముచినిపర్తి(చిట్యాల మండలం), టేకుమట్ల(టేకుమట్ల మండలం), అంకుశాపూర్(మొగుళ్ళపల్లి మండలం), గట్లకానిపర్తి(శాయంపేట మండలం), రామగుండాలపల్లి(కొత్తపల్లిగోరి మండలం) గ్రామాలల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి లతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అన్ని గ్రామాలల్లో పండుగ వాతావరణంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు జరగగా, అతిథులకు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, టపాసులు పేల్చి, బంతి పూలు చల్లి గ్రామస్తులు, మహిళలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలకగా, టేకుమట్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలల్లో ఆయా వేదికలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పేద, ధనిక తేడా లేకుండా చేయడమే ప్రజాస్వామ్యమని, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించడంతో పాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోనా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ప్రొసిడింగ్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధి కోసం ఎప్పుడైనా అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పథకాల అమలులో రాజకీయాలు చేయకుండా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. ప్రజలందరు ఆశీర్వదించి ఎన్నకున్న ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన పదమూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోయినా, పేదల జీవితాలలో వెలుగులు నింపటానికి దశల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.22 వేల కోట్లతో రైతులకి రుణమాఫీ చేశామని, సాగు చేసే ప్రతీ ఎకరానికి రైతు భరోసా కింద రూ.12 వేలు పెట్టుబడి సాయం నేటి నుండి ఇస్తున్నట్లు తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంత ఇంటి కల నెరవేరబోతుందని, అర్హులైన నిరుపేదలకు ఇండ్లు నిర్మాణానికి దశల వారిగా రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గత పదేండ్లుగా ఇవ్వని రేషన్ కార్డులు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చాక, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిరంతరం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. పరిశీలన చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులని గుర్తించాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అమలు చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని క్యాబినెట్ నిరంతరం కృషితో సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరే విధముగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
