కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) కు బదులుగా ప్రవేశపెట్టిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ని వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యుపిఎస్ లో చేరొద్దని, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓ పి ఎస్) ఇవ్వాలని సోమవారం రోజున టేకుమట్ల ఎమ్మార్వో విజయలక్ష్మి కి పి ఆర్ టి యు టిఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి హకీమ్, ప్రధాన కార్యదర్శి పప్పుల సునీల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మియాపురం జగన్నాధం, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కలాల ముత్యంరెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు సోమిడి స్వామి, మండల మహిళా ఉపాధ్యక్షురాలు వరికోలు ఉమాదేవి, మండల కార్యదర్శి సంగినేని పృథ్వీరాజ్, ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
