నరసరావుపేట: పల్నాడు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతి చెందినట్లు ICMR నిర్ధారించింది.
చికిత్స పొందినా ఫలితం లేకుండా…
చిన్నారి మార్చి 4న తీవ్ర జ్వరంతో మంగళగిరి ఎయిమ్స్‌లో చేరింది. వైద్యులు చికిత్స అందించినా మార్చి 16న చిన్నారి మరణించింది. పలు పరీక్షల అనంతరం తాజాగా అధికారికంగా ధృవీకరించారు.
చిన్నారిని మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. అప్పటికే చిన్నారికి జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, మూర్చ, విరేచనాలు, ఆహారం తినలేన్ని పరిస్థితిలో ఉంది. దీంతో.. అక్కడి వైద్యులు మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను సేకరించారు.పరిశోధనలో బర్డ్‌ఫ్లూ కారణంగా మృతి చెందినట్లు గుర్తించారు.
మృతికి గల ప్రధాన కారణాలు:
🔹పచ్చి కోడిమాంసం తినడం
🔹శరీరంలో రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తక్కువగా ఉండటం
ప్రభుత్వ చర్యలు:
🔸చిన్నారి మరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
🔸చిన్నారి ఇంటి పరిసరాల్లో ఆరోగ్యశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది.
🔸అనుమానిత లక్షణాలు ఉన్న వారెవరూ లేరని అధికారులు వెల్లడించారు.
🔸పల్నాడులో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు.
ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, కోడిమాంసాన్ని సరిగ్గా ఉడికించి తినాలని హెచ్చరికలు జారీ చేసింది.
