హైదరాబాద్: తెలంగాణలో గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) వ్యాధితో తొలి మరణం నమోదైంది. సిద్దిపేట జిల్లా కు చెందిన 25 ఏళ్ల వివాహిత గత నెల 31న నరాల నొప్పులతో ఆస్పత్రిలో చేరింది.
సంబంధిత వైద్యుల సమాచారం మేరకు, ఆమెకు GBS వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్లోని నిమ్స్ సహా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందారు.
GBS అంటే ఏమిటి?
గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) ఒక నాడీ సంబంధిత వ్యాధి. శరీర రోగనిరోధక వ్యవస్థ తప్పుగా స్పందించి, నరాలకు నష్టం కలిగించడంతో ఇది ఏర్పడుతుంది.
GBS లక్షణాలు:
శరీర నరాల బలహీనత
చేతులు, కాళ్లకు తిమ్మిర్లు
నడవడంలో ఇబ్బంది
కండరాల బలహీనత
శరీర నొప్పులు
జాగ్రత్తలు:
వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలుష్యాన్ని నివారించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రాథమిక లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.
GBS అంటువ్యాధి కాదు, కానీ సకాలంలో వైద్యం అందించడం ముఖ్యం.
