సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ప్రారంభం: రైతుల కష్టాలకు ముగింపు
జూలూరుపాడు, జూలై 14 (జిందగీ 9 న్యూస్ – వైరా):
సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్‌ను ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మండల అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ లు ప్రారంభించారు. జూలూరుపాడు మండల పరిధిలోని జూలూరుపాడు, వినోబా నగర్, హిమాంనగర్, ఏన్కూరు, రేపల్లెవాడ, వైరా, కొణిజర్ల, కారేపల్లి గ్రామాలకు ఈ కెనాల్ ద్వారా గోదావరి జలాలు చేరనున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, సుమారు 60 వేల ఎకరాలకు 700 క్యూసెక్కుల నీరు అందేలా కెనాల్ ఏర్పాటుచేయడం గర్వకారణమన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చి సహకరించిన ప్రతి రైతుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా అధికారుల కృషి వల్ల ఈ రోజు గోదావరి జలాలు ఈ ప్రాంత రైతులకు అందాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్, జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు, బుర్ర రాజశేఖర్, దుద్దుకూరి మధుసూదన్ రావు, రాంశెట్టి రాంబాబు, ధారవత్ రాంబాబు, కెనాల్ ఇంజినీర్ చౌడం నరసింహారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

