
సంక్షేమ పథకాల ఆన్లైన్ సేవలను CSCలకు కేటాయించాలని కలెక్టర్కు వినతిపత్రం
ఏన్కూర్, సెప్టెంబర్ 29 (జిందగీ9న్యూస్ రిపోర్టర్: రాము):రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాల ఆన్లైన్ సేవలను కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) కేటాయించాలని కోరుతూ TCVDSS తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బానోతు రాంబాబు, ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. ప్రవీణ్ కుమార్, రవి తదితరులు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా వినతిపత్రం అందజేశారు.
వారు మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ స్థాయిలో ఉన్న CSC సెంటర్లు గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పలు సేవలను ప్రజలకు చేరవేస్తున్నాయని, కొత్త సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. సెంటర్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ, ప్రజలకు సమయానికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర సంక్షేమ పథకాలను CSC సెంటర్లకు కేటాయిస్తే ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ ఆశయాలు నెరవేరతాయని వారు కలెక్టర్కు వినతిపత్రంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా VLEలు పాల్గొన్నారు.
