
శాంతినికేతన్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
టేకుమట్ల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్లో శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు గైనకాలజిస్ట్ డాక్టర్ పి. రజిత రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగనుంది.
ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం ద్వారా రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఎముకలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేయనున్నారు.
పలు మండలాల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.
