
వై శాఖపూర్ గ్రామంలో పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
పెబ్బేరు మండలం వై శాఖపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం రోజు పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజా కవి ఉద్యమం నడిపిన ప్రజావాది అయినా కాళోజి ప్రజా హక్కుల కోసం పోరాడారని. తెలంగాణ జీవిత చలనశీలి పుట్టుక,చావులు కాకుండా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన మహానీయుడు అని స్కూల్ ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్, మ్యాథ్స్ ఉపాధ్యాయులు సురేష్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఖయ్యూం మండల స్థాయి అవార్డు వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల ఆధ్వర్యంలో వారికి శాలువా, పులామాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన వనపర్తి జిల్లా టిపియుఎస్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్,స్కూలు ఉపాధ్యాయులు విజయ్ కుమార్,రామచంద్రుడు, బలపాల విజయ్,సురేష్,జయప్రకాష్, శ్రీనివాసులు,విశ్రాంత ఉపాధ్యాయులు శేఖర్ విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
