వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఐలాబాదులో సోమవారం ఉదయం దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మరియు పేపర్ ఆటో ఒకదానిపై ఒకటి ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ నుంచి వీణవంక వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న పేపర్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా… ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
