ధర్మపురి: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్తకు వ్యాపారవేత్తకు మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. నోట్ల కట్టలతో ఓట్లు కొనే వ్యూహాన్ని ప్రజలు ఓట్లతో తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం ధర్మపురిలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
“సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా”
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ—
✅ 34 సంవత్సరాలుగా తన విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని తెలిపారు.
✅ ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చిందని వివరించారు.
✅ ఓటమి భయంతో తనపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోందని, తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
✅ తాను ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
✅ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో NSUI, యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా టీమ్ చురుకుగా పనిచేస్తున్నాయని, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు అందిస్తున్నారని తెలిపారు.
పట్టభద్రులు తమ ఓటుతో అసలు అభ్యర్థిని గెలిపించాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
