బోయినిపల్లి, ఏప్రిల్ 03 (Zindagi9News):
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక చౌరస్తాలో శనివారం ఉదయం రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో టీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులను ఆపి డ్రైవర్ల లైసెన్స్‌లు, కండక్టర్ల లైసెన్స్‌లు పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారి వంశీధర్ మాట్లాడుతూ, డ్రైవర్లు ప్రయాణ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించరాదని, ప్రయాణికులతో అనవసరంగా ముచ్చటించకూడదని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు తమ లైసెన్స్‌లను మొబైల్ ఫోన్ల్లో చూపించినట్లు పేర్కొన్నారు.
కండక్టర్ లైసెన్స్‌లు లేకుండా విధుల్లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సుల కండక్టర్లపై కేసులు నమోదు చేయగా, పత్రాలు లేని మూడు సరుకు రవాణా వాహనాలను సీజ్ చేసి బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో సిబ్బంది సౌమ్య, ప్రశాంత్, హోం గార్డ్ ఎల్లయ్య పాల్గొన్నారు.
