జమ్మికుంట, మే 5 (zindagi9news) : వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణ కోసం ఉపాధి హామీ కూలీలు అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ అడి దెల మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం వావిలాల గ్రామంలోని పెద్ద చెరువు వద్ద పనిచేస్తున్న కూలీలకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలు గురించి వివరించారు. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు, పళ్ళ రసాలు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ తీసుకోవాలని, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని, ఉదయం 7 నుండి 10 గంటల మధ్య, సాయంత్రం 5 తర్వాతే పనులు చేయాలని సూచించారు. మాంసాహారం, మత్తుపదార్థాలు వాడకూడదని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ANM రమ, ఆశా వర్కర్ రమ, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
