నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని కన్నపకుంట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బొగ్గుల చంద్రశేఖర్ (39) అనారోగ్యంతో మృతి చెందాడు.ఆయన మృతికి డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం సంతాపం వ్యక్తం చేశారు.ఆదివారం కన్నపకుంట గ్రామంలోని మృతుని స్వగృహం నందు ఆయన భౌతిక కాయానికి యూనియన్ నాయకులు బి.లక్ష్మన్న,ఎస్.సుబ్బారెడ్డి తదితరులతో కలిసి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నట్లు ఆయన తెలిపారు.చంద్రశేఖర్ అతి చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని ఆయన కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.డోన్,కన్నపకుంట,బావిపల్లి తదితర గ్రామాలకు చెందిన లారీ డ్రైవర్లు,ఓనర్లు,బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
