
మేడారం జాతరలో తప్పిపోయే పిల్లల గుర్తింపుకు క్యూఆర్ కోడ్ రిస్ట్బ్యాండ్లు
ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా పిల్లలు తప్పిపోయే ఘటనలను నివారించేందుకు అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. చిన్నారుల ఆచూకీని త్వరగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక రిస్ట్బ్యాండ్లను ప్రవేశపెట్టారు.
జాతర ప్రాంతంలోని మొత్తం 11 కీలక ప్రాంతాల్లో ఈ రిస్ట్బ్యాండ్లు భక్తులకు అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను నమోదు చేయించడంతో, ఆ సమాచారం క్యూఆర్ కోడ్‌లో భద్రపరచబడుతుంది. జాతర సమయంలో ఏదైనా చిన్నారి తప్పిపోయి కనిపిస్తే, వారి చేతికి ఉన్న రిస్ట్బ్యాండ్పైని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలు వెంటనే కనిపిస్తాయి.
భారీగా భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో ఈ విధానం ద్వారా పిల్లలను తక్షణమే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ క్యూఆర్ కోడ్ రిస్ట్బ్యాండ్లు ధరింపజేయాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
