మృతురాలి దహన సంస్కారాలకు మేఘన్న అభయహస్తం

తోమాలపల్లి, జూలై 29:తోమాలపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి బుచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, సమాచారం ఎమ్మెల్యే మేఘరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే మేఘరెడ్డి ఆదేశాల మేరకు, మేఘన్న అభయహస్తం పథకం కింద రూ.5,000/- మృతురాలి కుటుంబ సభ్యులకు గ్రామ కాంగ్రెసు నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, మహాదేవయ్య, చంటి (మొగులన్న), రంగన్న, కె. రాముడు, గ్రామ అధ్యక్షులు బోరింగ్ శ్రీనివాసులు, కొన్నింటి రాముడు, ఉమేష్ గౌడ్, శివకుమార్, జి. అశోక్, జి.కే. అశోక్, శ్రీనివాస్ గౌడ్, విష్ణు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
