
పెబ్బేరు, జూలై 1 (జిందగీ 9 న్యూస్):
పెబ్బేరు మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన నేష బలరాం అకాల మరణం వార్త తెలుసుకున్న మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో తమవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇందుతోపాటు ఆ కుటుంబానికి ఆంజనేయులు సాగర్ తన వంతు రూ.5,000 ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు, మాజీ ఎంపీపీ రాజశేఖర్, సీనియర్ నాయకులు ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ వేణు రెడ్డి, మాజీ సర్పంచ్ గట్టయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు రాములు డి. మన్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మానవతా విలువలు మరోసారి ప్రతిబింబించాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
