ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు
చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్
బోయినిపల్లి; ఫిబ్రవరి 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం రోజున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ (71) వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .మండల కేంద్రంతో పాటు నీలోజిపల్లి, కొదురుపాకలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో బోయినిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్యలు మాట్లాడుతూ: అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన కేసీఆర్ ధీర్ఘాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణా ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సింగిల్ విండో చైర్మన్ అధ్యక్షులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి,నాయకులు గుంటి శంకర్, కొంకటి శేఖర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు అజ్జు, నల్లగొండ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
