బోయినిపల్లి, మార్చి 13: మచ్చ అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకకు చెందిన మచ్చ అనిల్ అనారోగ్యంతో మరణించగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.51,500 నగదు సహాయాన్ని ఆయన కుటుంబానికి అందజేశారు. అదనంగా, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్ అందజేసిన 50 కిలోల రైస్ బ్యాగులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ అందించిన 50 కిలోల రైస్ బ్యాగులు కూడా కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ, మచ్చ అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనిల్ భార్య డిగ్రీ పూర్తిచేసిందని, మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కుటుంబానికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనిల్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, నిలువ నీడ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి సహాయం అందించిందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగినిపల్లి వెంకటరామరావు, బోలుమాల శంకర్, మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, నాగుల వంశీ గౌడ్, కత్తెరపాక రవీందర్, జంగం అంజయ్య, మాజీ ఎంపిటిసి ఉయ్యాల శ్రీనివాస్, పిట్టల రమేష్, పెంజర్ల బాలమల్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనుముల హరికృష్ణ, మెరుపుల మహేష్, వెంకటేష్, పెంతల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
