
మండలంలోని పలు పాఠశాలల్లో పర్యటించిన జిల్లా అధికారులు
జిందగీ 9 న్యూస్, అక్టోబర్ 06 (వైరా నియోజకవర్గ రిపోర్టర్ రామునాయక్) : జూలూరుపాడు మండల పరిధిలోని పలు పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రాథమిక పాఠశాల, జూలూరుపాడులో భవిత రూంకు ఆమోదం లభించింది. అలాగే హైస్కూల్, యుపిఎస్ సూరవరం పాఠశాలల్లో CWSN పిల్లల కోసం ఫ్రెండ్లీ టాయిలెట్లు మంజూరయ్యాయి.
పనుల పురోగతిని పరిశీలించిన సందర్భంగా జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ సైదులు, జిల్లా ప్లానింగ్ అధికారి సతీష్ లు హైస్కూల్ మరియు ఎంపీపీఎస్ జూలూరుపాడు పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణాలను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ — భవనాలు, టాయిలెట్ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలని, డిజైన్ ప్రకారం పనులు చేయాలని సూచించారు.
ఈ పర్యవేక్షణలో మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ తప్పెట లక్ష్మీ నరసయ్య, పాఠశాల హెచ్ఎం నేతాజీ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ఆర్.సాంబశివరావు, జె.శ్రీను, ఉపాధ్యాయులు సీతారాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
