
బీసీలకు 42% రిజర్వేషన్లపై సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై శాసనసభ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
