
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం
పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2,996 వార్డులకు ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
మున్సిపల్ పాలనలో ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడం, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల ద్వారా పాలనను సమర్థవంతంగా కొనసాగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.
