డోన్ పట్టణ ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ కోచింగ్ క్యాంపును డోన్ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ…. ప్రైవేట్ స్కూళ్లతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలని డీఎస్పీ అన్నారు. విద్యతో పాటు క్రీడల వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు డీఎస్పీ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలకు కావలసిన సదుపాయాలను తమ దృష్టికి వ్యాయామ ఉపాధ్యాయులు తీసుకొని వస్తే సహకరిస్తామని డిఎస్పి అన్నారు. ఈ కబడ్డీ కోచింగ్ అనంతరం జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థులు పాల్గొంటారని ప్రభుత్వ పీఈటీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంతియాజ్ భాషా, రూరల్ సిఐ రాకేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ప్రభుత్వ పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
